రాజంపేటలో కల్తీ డీజిల్ విక్రయాలు..

రాజంపేటలో కల్తీ డీజిల్ విక్రయాలు..
- తనిఖీ చేసినా అదేతీరు..
రాజంపేట (బిక్కనూర్), ఆంధ్రప్రభ : రాజంపేట మండల కేంద్రంలోని ప్రైవేటు పెట్రోల్ బంక్(Indian Petrol Bunk)లో కల్తీ డీజిల్ విక్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాహనదారులు ఈ రోజు ఆందోళన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి మండలంలోని లింగాయపల్లి గ్రామానికి చెందిన ఓ ఆటో యజమాని రాజంపేట మండల కేంద్రంలోని ప్రైవేటు పెట్రోల్ బంక్లో ఆదివారం రాత్రి ఆటోలో డీజిల్ పోసుకున్నారు.
కాసేపటికి ఆటో మోరయించడంతో డిజిల్(Diesel)లో పొరపాటు జరిగిందని గ్రహించి పెట్రోల్ పంపు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఏదైనా ఉంటే ఉదయం తమ యాజమాని వస్తారనీ, అప్పుడు అడగాలని సిబ్బంది తెలపగా ఈ రోజు ఉదయం ఆటో యజమానితో పాటు పలు ట్రాక్టర్ల యజమానులు పంపు వద్దకు చేరుకొని పంపు యజమాని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కల్తీ డీజిల్ అమ్మడం వల్ల తమ ట్రాక్టర్లు, ఇతర వాహనాలు(Tractors, Other Vehicles) ఇంజన్లు దెబ్బతింటాయని వాహనదారులు ఆందోళన చేశారు. రెండు మూడుసార్లు బాటిల్ ద్వారా డీజిల్ తనిఖీ(Diesel Check) చేసిన అదే తీరు రావడంతో వాహనదారులు అవాక్కయ్యారు. కామారెడ్డి నుండి ఆటో మెకానిక్ తీసుకువచ్చి తనిఖీ చేయగా కల్తీ డీజిల్ వల్లనే ఆటో మొరాయిస్తుందని తెలపడంతో సదరు యజమాని ఆటో రిపేరుకు డబ్బులు తానే భరిస్తానని ఒప్పుకోవడంతో వివాదం సద్దుమణిగింది.
