అదిలాబాద్ – ఇచ్చోడా మండల కేంద్రంలో ని ప్రభుత్వగిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని చిక్రమ్ లాలిత్య అనుమానస్పదంగా మృతి చెందింది.వివరాల ప్రకారం బజార్ హతునూర్ మండలం లోని మోర్ కండి గ్రామానికి చెందిన చిక్రమ్ లాలిత్య గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువు తుంది. సోమవారం ఉదయం తోటివిద్యార్థులు లేచి పక్కనే పడుకున్న లాలీత్య ను లేపగా ఎంతకు లేవకపోవడంతో వెంటనే పాఠశాల సిబ్బందికి తెలుపగా వెంటనే కుటంబ సభ్యులకు సమాచారం అందజేశారు.. పోలీసులకు సమాచారం అందచేయగా సీఐ బిమేష్ సంఘటన స్థలాని పరిశీలించి కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్ట్ మార్టటానికి తరలించారు..
Adilabad | గురుకుల పాఠశాల విద్యార్ధిని అనుమానస్పద మృతి..
