నిర్మల్ రూరల్, ఆంధ్రప్రభ న్యూస్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంపై ఈరోజు (గురువారం) అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మున్సిపల్ కార్యాలయంలోని ఇద్దరు ఉద్యోగులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడట్టుకున్నారు.
సీనియర్ అసిస్టెంట్ ఇంచార్జ్ ఆర్ఐ సంతోష్, కాంట్రాక్ట్ బిల్ కలెక్టర్ షోయబ్‌లు రూ.6,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వారిని పట్టుకున్నారు. నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో సంతోష్, షోయబ్‌లు లంచం తీసుకుంటున్నారనే పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు ఈ ఆకస్మిక దాడులు నిర్వహించారు.
లంచం తీసుకుంటున్న సమయంలోనే అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు వారిని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ దాడులు, ఇద్దరు ఉద్యోగులు లంచం తీసుకుంటూ పట్టుబడటం నిర్మల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై ఏసీబీ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.