ముంపు లేకుండా అధికారుల చర్యలు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : మొంథా తుఫాన్ ప్రభావంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్(Chautauqua Division) వ్యాప్తంగా ఈ రో్జు తెల్లవారుజామున నుండే విస్తారంగా వర్షాలు కురుస్తున్నందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చౌటుప్పల్ ఆర్డీవో వెలమ శేఖర్ రెడ్డి తెలిపారు. వివిధ శాఖల అధికారులతో కలిసి వర్షం నీటితో నిండి అలుగులు పారుతున్న చెరువులను పరిశీలించారు. వర్షాల కారణంగా పలు గ్రామాలలో చెరువులు, కుంటలు(Cheruvulu, Kuntalu) నిండి అలుగులు పోస్తున్నాయి.
రహదారులపై ఉన్న కల్వర్టులపై నుండి వరద నీరు రోడ్లపై భారీగా ప్రవహిస్తుండటంతో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా దండు మల్కాపురం చెరువు నుండి వరద నీరు అలుగు ద్వారా ప్రవహించి కైతాపురం, లక్కారం చెరువులు నిండి చౌటుప్పల్ ఊర చెరువులోకి చేరుతుంది. వరద నీటి కారణంగా ఊర చెరువు నిండి గతంలో మాదిరిగా చౌటుప్పల్ పట్టణం ముంపుకు గురై అవకాశం ఉండటంతో ఆర్డీవో శేఖర్ రెడ్డి(RDO Shekhar Reddy), ఇరిగేషన్ ఈ ఈ మనోహర్, డీ ఈ రాజ వర్ధన్ రెడ్డి, మండల తహసిల్దార్ వీరబాయి, చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకట్రామిరెడ్డి అప్రమత్తమయ్యారు.
ముందస్తుగా దండు మల్కాపురం చెరువు అలుగు నుండి వచ్చే వరద నీరును కైతాపురం చెరువులోకి రాకుండా జేసీపీ ద్వారా తవ్వి అడ్డుకొని మూసీ కాలువలోకి దారి మళ్లించారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తుగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా చౌటుప్పల్ ఊర చెరువులోని అలుగు ప్రాంతంలో చెట్లను తొలగించి శుభ్రం చేశారు. తుఫాన్ వల్ల వర్షాలు కురుస్తున్న ఆర్డిఓ శేఖర్ రెడ్డి అన్ని శాఖల అధికారులతో ఆర్డీవో కార్యాలయంలో తుఫాన్(Tufan) వల్ల కురుస్తున్న వర్షాలు, వరదలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించారు.

అన్ని శాఖల అధికారులు ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమాలలో చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ మన్మథ కుమార్(Manmatha Kumar), రెవెన్యూ గిర్దావరి బాణాల రాంరెడ్డి తదితర అధికారులతో పాటు మార్కెట్ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.

