వారి పై చర్య తీసుకోవాలి – మారేపల్లి మల్లేష్..

వారి పై చర్య తీసుకోవాలి – మారేపల్లి మల్లేష్..

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని నవాబుపేట శివారులోని రెండు గుట్టల ఎర్ర మట్టిని అక్రమంగా తరలిస్తున్న కాంట్రాక్టర్ల పై చర్యలు తీసుకోవాలని సీపీఐ ఎం ఎల్ పార్టీ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు పేరుతో ప్రకృతి సహజ సంపద, సంబంధిత కాంట్రాక్టర్ అక్రమంగా ఎర్రమట్టి ని తరలిస్తున్నారు. మండలంలో మైనింగ్, ఫారెస్ట్ , రెవెన్యూ అధికారులు, జిల్లా రెవెన్యూ, జిల్లా మైనింగ్ జిల్లా ఫారెస్ట్ అధికారులు, కాంట్రాక్టర్ల పైన చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్, స్పందించి గుట్టల నుండి ఎర్రమట్టి తరలింపు నిలిపివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు రామ్, రామచందర్ మాదిగ పాల్గొన్నారు.

Leave a Reply