ACP | రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌… నేరాలకు చెక్‌!

ACP | రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌… నేరాలకు చెక్‌!

  • పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాలతో చర్యలు
  • ఖమ్మం నగరంలో రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా
  • నేరప్రవృత్తి మార్చుకుంటేనే అవకాశం
  • మారకపోతే పీడీ యాక్ట్ కింద కేసులు
  • భూ కబ్జాదారులు, రియల్టర్లపై దృష్టి
  • సత్ప్రవర్తనతో ఉంటే రౌడీషీట్ల తొలగింపు
  • నగర ఏసీపీ రమణ మూర్తి

ACP | ఆంధ్రప్రభ, ఖమ్మం : పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఖమ్మం నగరంలోని రౌడీషీటర్లకు టౌన్ ఏసీపీ రమణమూర్తి ఇవాళ‌ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఖమ్మం టౌన్ ఏసీపీ కార్యాలయంలో (Acp Office) ఈ కార్యక్రమం జరిగింది. నగర శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రౌడీషీటర్లను ఒక్కొక్కరిని పిలిచి వ్యక్తిగతంగా మాట్లాడారు. వారి ప్రస్తుత జీవన విధానం గురించి వివరాలు తెలుసుకున్నారు. ఎక్కడ నివాసం ఉంటున్నారు అనే అంశాన్ని కూడా నమోదు చేశారు. ఏ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు అన్నదానిపై ఆరా తీశారు. సమాజంలో మార్పు రావాలనే ఉద్దేశంతోనే కౌన్సెలింగ్ చేపట్టినట్లు వెల్లడించారు.

ACP | మార్పున‌కు అవకాశం… లేకపోతే కఠిన చర్యలు…

నేరప్రవృత్తిని మార్చుకునేందుకు ఇది చివరి అవకాశమని ఏసీపీ స్పష్టం చేశారు. ఇప్పటికైనా మంచి మార్గంలోకి రావాలని సూచించారు. పాత నేరాలు పునరావృతం చేయకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఒకవేళ హెచ్చరికలను పట్టించుకోకపోతే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందన్నారు. యధావిధిగా నేరాలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తప్పవన్నారు. అవసరమైతే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద కేసులు (Case) నమోదు చేస్తామని తెలిపారు. నేరస్తుల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ACP | భూ కబ్జాలు, రియల్టర్లపై ప్రత్యేక దృష్టి…

ప్రభుత్వ, ప్రైవేట్ భూముల కబ్జాలకు పాల్పడే రౌడీషీటర్లపై (Rowdy sheeters) ప్రత్యేక దృష్టి సారించినట్లు ఏసీపీ తెలిపారు. భూ వివాదాల్లో రౌడీషీటర్ల పాత్ర పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రియల్టర్ల ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్న వారిని గుర్తిస్తున్నట్లు చెప్పారు. నగరంలో జరిగే చాలా నేరాల్లో రౌడీషీటర్లే నిందితులుగా ఉంటున్నారని పేర్కొన్నారు. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుని దాడులకు దిగుతున్నారని వివరించారు. దీంతో పోలీస్ రికార్డుల్లోకి వారి పేర్లు ఎక్కుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితులను నియంత్రించేందుకే ముందస్తు చర్యలు చేపట్టామని చెప్పారు. కౌన్సెలింగ్ కూడా అందులో భాగమేనన్నారు.

ACP | ప్రత్యేక నిఘా… ఉపేక్షే లేదు…

రౌడీషీట్ ఉన్న ప్రతీ ఒక్కరిపై నిరంతర నిఘా ఉంటుందని ఏసీపీ హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. చిన్న తప్పిదాన్ని కూడా తేలిగ్గా తీసుకోబోమని స్పష్టం చేశారు. నగర శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. పోలీస్ (Police) బలగాలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నాయని తెలిపారు. నేరాలకు పాల్పడేవారి కదలికలను గమనిస్తున్నామని చెప్పారు. ప్రజల సహకారంతోనే నేరాలను నియంత్రించగలమన్నారు. శాంతియుత వాతావరణం కోసం అందరూ సహకరించాలని కోరారు.

ACP | సత్ప్రవర్తనతో ఉంటే రౌడీషీట్ తొలగింపు…

గత కొంతకాలంగా నేరాలకు దూరంగా ఉంటున్న పాత నేరస్తులపై కూడా అధికారులు సమీక్ష నిర్వహించారు. పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కాకుండా సత్ప్రవర్తనతో ఉన్నవారిని గుర్తించారు. వారి ఒక్కొక్కరి కేసు డైరీని (Case diary) పరిశీలించినట్లు తెలిపారు. నేర ప్రవర్తనలో నిజమైన మార్పు కనిపిస్తే రౌడీషీట్లను తొలగించినట్లు చెప్పారు. అయితే తిరిగి నేరాలకు పాల్పడితే రౌడీషీట్ మళ్లీ తెరుస్తామని హెచ్చరించారు. నేరాలు పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టే రౌడీషీటర్లపై సమాచారం ఇవ్వాలని కోరారు. ఎవరైనా ఇబ్బంది పెడితే నేరుగా పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

CLICK HERE TO READ యథేచ్ఛగా అక్రమ మట్టి తోలకాలు

CLICK HERE TO READ MORE

Leave a Reply