Accident | ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీ

Accident | ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీ

  • ఒకరికి తీవ్ర గాయాలు
  • బాన్స్ వాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

Accident | జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : జుక్కల్ మండలంలోని పెద్ద ఎడ్గి సమీపాన ప్రధాన రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనలు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.

108 అంబులెన్స్(108 Ambulance) సిబ్బంది మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బస్వాపూర్ గ్రామానికి చెందిన సుంకరివిఠల్(25) ద్విచక్ర వాహనంపై పెద్ద ఎడ్గి గ్రామం వైపు పోయేక్రమంలో జుక్కల్ కి చెందిన శంకర్(33) పెద్దఎడ్గి గ్రామం వైపు నుండి ద్విచక్ర వాహనంపై జుక్కల్ కు వస్తున్న క్రమంలో రెండు ద్విచక్ర వాహనాలు పెద్దఎడ్గి గ్రామ సమీపంలో బలంగా ఢీకొనటంతో శంకర్, విట్టల్ కు గాయాలు కావటంతో స్థానికులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు.

Accident |

వైద్య సిబ్బంది పైలట్ సయ్యద్ కరీం, ఈఎంటి ప్రసాద్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని జుక్కల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శంకర్ కు తీవ్రగాయాలు కావటం, పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు వారిని బాన్స్ వాడ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అదే అంబులెన్స్ లో క్షేత్రగాత్రులను బాన్స్ వాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శంకర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

Leave a Reply