Accident | దండు మల్కాపురంలో రోడ్డు ప్రమాదం – ఇద్దరి దుర్మరణం
యాదాద్రి భువనగిరి జిల్లాలో చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు డివైడర్ ఢీ కొట్టి.. విజయవాడ వైపు వెళ్తున్న కారును ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నది. సాయికుమార్ (33)తో పాటు ఐదునెలల బాలుడు వీర్షాన్ మృతి చెందాడు.
ముగ్గురు సభ్యులు హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్తుండగా.. హైదరాబాద్ వైపు వెళ్తున్న కారులో ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. రెండు కార్లలో మొత్తం ఆరుగు ప్రయాణికులు ఉన్నారు. గాయపడ్డ వారిని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు