Accident | రోడ్డు ప్రమాదంలో.. యువకుడికి గాయాలు…

Accident | రోడ్డు ప్రమాదంలో.. యువకుడికి గాయాలు…
Accident | కమలాపూర్, ఆంధ్రప్రభ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామ శివారు భీంపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఆటోట్రాలీ – బైక్(Autotrolley – bike) డీకొన్న ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. జమ్మికుంట మండలం తనుగుల గ్రామానికి చెందిన రేణికుంట్ల ఆకాష్ (25) అనే యువకుడు తనగుల నుంచి హనుమకొండకి వెళ్లే క్రమంలో ఉప్పల్ గ్రామం శివారులో ఆటో ట్రాలీ ఢీకొనగా యువకుడికి కుడిచెయ్యికి, కుడికాలు నుజ్జు నుజ్జయి తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే సమాచారం అందుకున్న కమలాపూర్ 108 సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన యువకుడికి ప్రథమ చికిత్స అందిస్తూ వరంగల్ లోని ఎంజీఎం హాస్పిటల్(Hospital) కి తరలించారు.
