చండీగడ్ – పంజాబ్‌లోని (punjab ) హోషియార్‌పూర్ జిల్లాలో (hoshiypur district ) సోమవారం ఉదయం బస్సు మార్గమధ్యలో బోల్తా (over turned ) పడింది, ఈ ప్రమాదంలో 10 మంది మరణించగా, కనీసం 32 మంది గాయపడ్డారు. దసుయా ప్రాంతంలోని దసుయా-హాజీపూర్ రోడ్డులోని సాగ్రా అడ్డా సమీపంలో ఈ సంఘటన జరిగింది. బస్సు నియంత్రణ కోల్పోవడంతోనే బోల్తా పడిందని పోలీసులు చెప్పారు.. గాయపడిన వారిని చికిత్స కోసం దసుహాలోని సివిల్ ఆసుపత్రిలో(civil hospital ) చేర్చారు.
బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సహాయం కోసం కేకలు విన్న స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు. పోలీసులను అప్రమత్తం చేసి, అంబులెన్స్‌లను వెంటనే రప్పించారు. పోలీసు బృందాలు, స్థానికుల సహాయంతో, గాయపడిన వారిని బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రమాదానికి గురైన వాహనం కర్తార్ బస్ అనే ప్రైవేట్ సంస్థ నడుపుతున్న మినీ బస్సు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా అస్పష్టంగా ఉన్నప్పటికీ, డ్రైవర్ లోపం, యాంత్రిక వైఫల్యం , ఇతర రహదారి సంబంధిత సమస్యల వల్ల జరిగిందా అని తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.