Accident | తప్పిన పెను ప్రమాదం..

Accident | తప్పిన పెను ప్రమాదం..
Accident, గన్నవరం, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా గన్నవరం చిన్న అవుటపల్లి వద్ద చెన్నై కోలకత్తా జాతీయ రహదారి పై ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొన్న సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గగన్ ట్రావెల్స్కు చెందిన బస్సు (AR 20 E 3344) హైదరాబాదు నుంచి అమలాపురం (Amalapuram) వెళుతుంది. చిన్న అవుటపల్లి మిశ్రా హోటల్ ఎదురుగా ఉన్న రోడ్డు క్రాసింగ్ దగ్గర ఓ లారీ యూటర్న్ తీసుకుంటుంది. ఇది గమనించిన బస్సు డ్రైవర్ అప్రమత్తమై లారీని తప్పించే క్రమంలో సదరు లారీకి బస్సు కుడివైపున (డ్రైవర్ ప్రక్కన) తగిలింది. డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సు ముందు భాగం దెబ్బతిన్నప్పటికీ ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారు. పెను ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
