Accident | ఘోర రోడ్డుప్రమాదం..

Accident | ఘోర రోడ్డుప్రమాదం..

లారీ క్రిందికి దూసుకెళ్లిన కారు
ఐదుగురు అక్కడికక్కడే మృతి

Accident | గంగవరం, ఆంధ్రప్రభ : మండలం లోని బెంగళూరు-చెన్నై జాతీయ రహదారి బైపాస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.బుధవారం ఉదయం బెంగళూరు నుంచి తిరుపతి వెళుతున్న ఓ కుటుంబం బైపాస్ లో ముందు వెళ్తున్న లారీని ప్రమాదవశాత్తు వేగంగా వెనుక నుంచి ఢీకొంది. వెనక శబ్దం రావడంతో లారీని ఆపి చూడగా కారు వెనుక నుంచి వేగంగా వచ్చి పూర్తిగా లారీ లోనికి దూసుకు వెళ్లింది.ఈ తీవ్రతకు కారులోని ముగ్గురు మహిళలు,ఇద్దరు పురుషులు అక్కడికక్కడే మృతి చెందారు.

కాగా లారీ సిమెంట్ లోడ్ ను దించి నెల్లూరుకి తిరిగి వెళుతుండగా,ఇనోవా యారీస్ కారు వెనుక ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు డ్రైవర్ చెబుతున్నాడు. కారు వేగంగా వచ్చి తన లారీ వెనుక వైపు వేగంగా ఢీకొన్నట్లు డ్రైవర్ పోలీసులకు వివరించాడు. సమాచారం అందుకున్న గంగవరం,పలమనేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఎక్స్ వేటర్ ద్వారా లారీ వెనక ఇరుక్కున్న కారులో నుంచి మృతదేహాలను బయటకు తీస్తున్నారు.

ఇందులో మృతులు బెంగళూరు వాసులుగా తెలుస్తోంది.మృతులు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరం రాజాజీ నగర్ కు చెందిన వారుగా గుర్తించారు.
బంధువులు,పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు..
మృతులు కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన మోహన్ దాస్ (71), నాగరాజరావు (61),కుసుమ (61),జయంతి (59),
పూజ (33)గా గుర్తించారు.

ప్రమాద ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

గంగవరం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనపై పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులతో ఫోన్‍లో మాట్లాడి ఘటనపై వివరాలు అడిగి తెలుసు కున్నారు. ఐదు మంది అక్కడికక్కడే మృతి చెందిన విషయాన్ని తెలుసుకొని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారికి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

Leave a Reply