Accident | బైక్ పై నుండి పడి..

Accident | బైక్ పై నుండి పడి..
- ఒకరు మృతి
Accident | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : బైక్ పై వెళ్తూ.. అదుపుతప్పి కింద పడి ఒకరు మృతిచెందిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో ఎర్రవల్లి సమీపంలో చోటచేసుకుంది. ఇటిక్యాల ఎస్ఐ రవి తెలిపిన వివరాల ప్రకారం… హైదరాబాద్ లోని బోరబండకు చెందిన రాముడు అలంపూర్ తాలూకా పుల్లూరు గ్రామంలో తన బంధువు మృతి చెందడంతో అక్కడి వెళ్లి…తిరిగి అతను బైక్ పై హైదరాబాద్ కు వెళ్తున్నాడు.
ఈ క్రమంలో కొట్టం కాలేజ్ సమీపంలో డివైడర్ ను ఢీకొని బైక్ అదుపు తప్పడంతో రాముడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
