- విద్యుత్ సమస్యలపై 1912కి కాల్ చేయండి
వరంగల్ : నయీంనగర్ ప్రాంతంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను విద్యుత్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. కుండపోత వర్షం మధ్య ఫీల్డ్ ఇంజినీర్లు, సిబ్బందితో మాట్లాడి, ఫెడర్లు, సబ్‌స్టేషన్ల ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు.
ఎక్కడైనా సరఫరా అంతరాయం ఏర్పడితే తక్షణమే స్పందించి పునరుద్ధరించాలని ఆయన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రజలు ఆందోళన చెందకుండా, ఏ సమస్య వచ్చినా వెంటనే 1912 నంబర్‌కు కాల్ చేసి తెలియజేయాలని సీఎండీ వరుణ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

