నిజామాబాద్ ప్రతినిధి, మార్చి 3 (ఆంధ్రప్రభ) : నిజామాబాద్ జిల్లాలోని అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇవాళ ఉదయం ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టడం కలకలం రేపింది. సబ్ రిజిస్ట్రార్ రూ.10వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రస్తుతం ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు త్వరలోనే వెల్లడించనున్నారు.
Nizamabad | ఏసీబీ సోదాలు… పట్టుబడిన సబ్ రిజిస్ట్రార్..
