ACB Raids – కాళేశ్వరం ఈఎన్‌సీ హరిరామ్‌ ఇంటిపై ఏసీబీ దాడులు

హైదరాబాద్‌: కాళేశ్వరం ఈఎన్‌సీ హరిరామ్‌ ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నది. హైదరాబాద్‌ షేక్‌పేటలోని ఆదిత్య టవర్స్‌లోని ఆయన నివాసంలో శనివారం తెల్లవారుజాము నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పత్రాలు, కంప్యూటర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరిరామ్‌ కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. కాళేశ్వరంపై ఎన్‌డీఎస్‌ఏ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆయన నివాసంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు స‌మాచారం.

కాగా, హరిరామ్‌ ప్రస్తుతం కాళేశ్వరం గజ్వేల్‌ ప్రాంత ఈఎన్‌సీగా విధులు నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం కార్పొరేషన్‌ ఎండీగా కూడా పనిచేశారు. ప్రాజెక్టు అనుమతులు, రుణాల్లో కీలకంగా వ్యవహరించారు. ఆయన భార్య అని కూడా నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఈఎన్‌సీగా పనిచేశారు. ప్రస్తుతం వాలంతరి డైరెక్టర్‌ జనరల్‌ బాధ్యతల్లో ఉన్నారు.

సోదాల్లో భాగంగా హరిరామ్ పేరిట భారీగా ఆస్తుల ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. గజ్వేల్‌లో 30 ఎకరాల భూమి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 3 బ్యాంక్ లాకర్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అవకతవకలపై గతేడాది సెప్టెంబర్ 27న జస్టిస్‌ పీసీ ఘోష్ కమిషన్ గజ్వేల్ ఈఎన్సీ, కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా ఉన్న హరిరామ్‌ను విచారించిం ది. ఈ మేరకు జస్టిస్ పీసీ చంద్రఘోష్,ఆయనకు 90కి పైగా ప్రశ్నలను సంధించారు. అదేవిధంగా ప్రాజెక్టు నిర్మాణ బిల్లుల చెల్లింపు లకు ఏర్పాటు చేసిన కాళేశ్వరం కార్పొరేషన్ ఆర్థిక అంశాలపై సైతం కమిషన్ ఆరా తీసింది. కార్పొరేషన్ ద్వారా బ్యాంకులకు రూ.29,737 కోట్లు వరకు తిరిగి చెల్లించినట్లుగా ఆయన విచారణలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *