ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) మున్సిపల్ కార్పొరేటషన్ కార్యాలయంలో ఏసీబీ (ACB) అధికారులు ఈ రోజు దాడి చేశారు. ఓ రిటైర్డ్ ఆర్మీ జవాన్ (Retired army jawan) నుంచి మున్సిపల్ ఆర్ఐ శ్రీనివాస్ ఏడు వేల రూపాయలు లంచం తీసుకుంటుండుగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ప్రస్తుతం మున్సిపల్ కార్యాలయంలో విచారణ చేపట్టారు.
విచారణ కొనసాగుతోంది. నిజామాబాద్ (Nizamabad) నగరంలో పండ్ల దుకాణం నడపడం కోసం ఓ రిటైర్డ్ ఆర్మీ జవాన్ అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. అయితే లంచం ఇవ్వాలని ఆర్ఐ (RI) డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులను ఆయన ఆశ్రయించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంటుంది.