Maktal | ఏసీబీ దాడులు.. రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన సీఐ
మక్తల్: ఫ్రీగా వస్తున్నాయని మంది సొమ్ముకు ఆశపడ్డ ఖాకీలు అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికారు. రూ.20 వేల కోసం కక్కుర్తిపడ్డ సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఈ ఘటన నారాయణ పేట జిల్లాలో కలకలం రేపింది.
జిల్లాలోని ఉట్కూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి నుంచి మక్తల్ సీఐ చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు శివారెడ్డి, నర్సింహులు రూ.20.వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడి చేసి పట్టుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పోలీస్ స్టేషన్‌లోని సీఐ చాంబర్‌పై ఏసీబీ రెయిడ్ చేయగా.. చంద్రశేఖర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. ఆయనకు సహకరించిన కానిస్టేబుళ్లను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.