సింగరేణి మనుగడపై ‘గైర్హాజరు’ గుదిబండ..!
- డుమ్మా కొట్టే వారి మెడపై వేలాడనున్న కత్తి..!
- తల్లిదండ్రుల త్యాగాలు పట్టించుకోని యువ కార్మికులు
- బంగారంలాంటి ఉద్యోగంపై బాధ్యత లేని వారసులు..!
- 8 గంటల పని విధానం టైంపాస్ కేనా..?
- నిర్దేశిత లక్ష్యాలు అధిగమించడం కంపెనీకి కష్టతరం..
- నిర్లక్ష్యంపై యాజమాన్యం ప్రత్యేక ఫోకస్..
- ఇకపై 150 రోజుల విధులు తప్పనిసరి చేస్తూ నిర్ణయం..!
గోదావరిఖని, ఆంధ్రప్రభ : ఇప్పటికే సింగరేణి(Singareni బొగ్గు పరిశ్రమ కష్టాలతో ప్రయాణం చేస్తోంది. కంపెనీ మనుగడ కోసం, బొగ్గు ఉత్పత్తులు పెంచడం కోసం యాజమాన్యం నానా కుస్తీలు పడుతోంది. లక్ష్యం చేరుకోవడం సంస్థకు ప్రతి ఆర్థిక సంవత్సరం ఒక పరీక్షగా మారుతోంది.. నూతన బొగ్గు గనులు ఏర్పాటు చేసే పరిస్థితి లేదు.
కొత్తగా కొలువులు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నడుమ 136 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి బొగ్గు పరిశ్రమ మనుగడపై గని కార్మికుల గైర్హాజరు సమస్య గుదిబండగా మారింది. సకల సౌకర్యాలు కల్పించిన, అకారణంగా గైర్హాజరవుతున్న(absentee) కార్మికుల వ్యవహారం యాజమాన్యానికి తలనొప్పిగా తయారైంది.
డుమ్మా కొట్టేవారంతా యువ కార్మికులే..!
కారుణ్య నియామకాల పేరుతో కొత్తగా కొలువులు పొందిన యువ కార్మికులే ఎక్కువగా విధులకు డుమ్మా కొడుతున్నారనే విషయాన్ని సింగరేణి యాజమాన్యం(management) పసిగట్టింది. యువ కార్మికులే సంస్థలో ఎక్కువ శాతం మంది డిస్మిస్‌లకు గురవుతున్నట్లు తెలుస్తోంది. విధులు సక్రమంగా చేయకుండా డిస్మిస్ అవుతున్న వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ పోతుంది. డిపెండెంట్ ఉద్యోగం రావాలంటే ప్రస్తుతం అంత ఆషామాషీ వ్యవహారం కాదు.


వచ్చిన ఉద్యోగాన్ని కాపాడుకుంటూ, నమ్ముకున్న కుటుంబానికి ధైర్యంగా ఉండాల్సిన యువ కార్మికులు బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్న అపవాదులే ఎక్కువగా వినిపిస్తున్నాయి. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన కార్మికులు(workers) కుటుంబ పోషణ బాధ్యతలను పూర్తిగా విస్మరిస్తున్నారని చెప్పుకోవాల్సి రావడం ఒకింత బాధాకరమైన పరిస్థితి..
ఉద్యోగం కాపాడుకోవడంలో బాధ్యతారాహిత్యం..
కొంతమంది కార్మికులు వ్యక్తిగత కారణాలతో గైర్హాజరవుతుంటే.. మరికొంతమంది యువ కార్మికులు(young workers) వ్యసనాలకు బానిసలుగా మారడం మూలంగానే ఉద్యోగాలు సక్రమంగా చేయడం లేదనే వాదన ఎక్కువగా వినిపిస్తోంది. ఉద్యోగాన్ని కాపాడుకునే విషయంలో బాధ్యత రాహిత్యం వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఉద్యోగ అవకాశాలు దక్కడంలో తల్లిదండ్రుల త్యాగాలకు ప్రస్తుతం విలువ లేదనే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.

ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకొని.. సంస్థకు రెండేళ్ల పాటు సర్వీసును వదిలిపెట్టి.. మెడికల్ అన్ఫిట్ అయి… తల్లిదండ్రులు తమ వారసులకు సింగరేణి ఉద్యోగాలను కట్టబెడితే సదరు కార్మికుడు ఉద్యోగం చేయడం కన్నా జల్సా చేయడమే గొప్ప అనే స్థాయిలో వ్యవహరిస్తున్నారని అపవాదు ఉంది. కనీసం మార్పు చెందే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఈ కారణంగా విధులకు గైర్హాజర్(bsenteeism) అవుతూ డిస్మిస్‌లకు గురవుతున్నారు.
డిస్మిస్కు గురైన కార్మికులకు మళ్లీ ఉద్యోగ అవకాశం సింగరేణి కంపెనీ కల్పించినప్పటికి మళ్లీ దానిని కూడా సక్రమంగా నిలబెట్టుకోవడంలో బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారని సంస్థ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. ఫలితంగా గైర్హాజర్ అవుతున్న కార్మిక కుటుంబాలు కష్టాలను అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది.
డ్యూటీ సమయాల్లో టైంపాస్..!
బొగ్గు గనులు, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల వద్ద పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు డ్యూటీ సమయాల్లో టైంపాస్కే ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఎనిమిది గంటలు పనిచేయాలన్న నిబంధనలను దాదాపుగా పాటించడం లేదు. ఈ విషయాన్ని కంపెనీ ఉన్నతాధికార యంత్రాంగం గుర్తించింది. అండర్ గ్రౌండ్(underground) (భూగర్భ) బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులను మినహాయిస్తే… ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో పని చేసే మెజారిటీ కార్మికులు 8 గంటలు పనులు చేయడం లేదని యాజమాన్యం పరిశీలనలో తేలింది.
అలాగే వివిధ సర్ఫేస్ వి భాగాలు, కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు సైతం డ్యూటీ సమయాలను టైంపాస్ చేస్తున్నారన్న వాదన ఎక్కువగా ఉంది. కార్మికులు ఉద్యోగులు ప్రతి షిఫ్ట్ సుమారు 2 గంటల పాటు డ్యూటీ సమయాలను కంపెనీకి వినియోగించకుండా టైం పాస్(time pass) చేయడం, డ్యూటీ సమయాలను సొంత అవసరాలకు వినియోగించుకోవడం వంటి కారణాలతో సంస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని యాజమాన్యం పర్యవేక్షణలో తేలినట్లు సమాచారం.
లక్ష్యాన్ని చేరుకోవడంలో తప్పని కష్టాలు..
బొగ్గు పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు రోజుకు వేల సంఖ్యలో గైరాజర్ అవుతుంటే సంస్థ తమ నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో కష్టాలను చవిచూస్తోంది. గైర్హాజర్ తోపాటు డూటీ(duty)కి వచ్చిన కార్మికులు కూడా విధులు సక్రమంగా నిర్వహించకపోవడంతో ఉత్పత్తికి ఆటంకాలు ఎదురవుతున్నట్లు సంస్థ దృష్టికి వచ్చింది. రోజుకు 8 గంటల పని వేళల్లో కనీసం 6 గంటల సమయం కూడా కార్మికుడు శ్రమించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కరు శ్రమించకపోతే ఉత్పత్తి ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అందరూ బాధ్యతగా పని చేసినప్పుడే సంస్థ అభివృద్ధి చెందుతుంది. సింగరేణి పరిశ్రమ పరిరక్షణకు ఒకవైపు కార్మిక సంఘాలు ఐక్య ఉద్యమాలకు సిద్ధమవుతుంటే.. బొగ్గు పరిశ్రమకు గైరాజర సమస్య జటిలంగా తయారైందని తెలుస్తోంది.
గైర్హాజర్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి..
ఉత్పత్తి లక్ష్యాలను పెంచేందుకు, కార్మికుల గైరాజా సమస్యను పరిష్కరించేందుకు యజమాన్యం కొత్త సంస్కరణలను అమలు చేసేలా కార్యాచరణను చేపట్టినట్లు తెలుస్తుంది. రోజురోజుకు పెరిగిపోతున్న గైరాజర్ సమస్యను కట్టడి చేసేందుకు సింగరేణి యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించింది.
విధులు సక్రమంగా నిర్వర్తించకుండా దుమ్మాలు కొట్టే కార్మికులకు సింగరేణి ఉద్యోగం విలువ తెలియజేసేలా కొన్ని కఠినమైన నిర్ణయాలను తీసుకొని గైరాజాల సమస్యలకు చెక్(check) పెట్టే ప్రయత్నం చేపట్టబోతున్నట్లు సమాచారం. ఎన్నిసార్లు అవకాశం ఇచ్చిన మార్పురాని గైర్హాజర్ కార్మికుల పట్ల సంస్థ కొంత కఠినంగానే వ్యవహరించే పరిస్థితి కనిపిస్తోంది.
యంత్రాల రాకతో తగ్గిన భారం..
గతంలో బొగ్గు బాయిలో పని అంటే కష్టంగా ఉండేది. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితేమీ లేదు. అన్ని మిషన్ మైనింగ్లో ఏర్పడ్డాయి. అయిన్పటికీ ఏడాదిలో కనీసం 100 రోజులు కూడా చేయలేని కార్మికులు ఉన్నారంటే ఉద్యోగం పట్ల మనకున్న నిబద్ధత స్పష్టం చేస్తోంది. ఏదో సాదాసీదాగా పనిచేస్తాం.. ఉద్యోగం అయితే పూర్తిగా తీసివేయరు కదా..? అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
కంపెనీ(company) ఇచ్చే సౌకర్యాలు, రాయితీలతో కుటుంబాన్ని నెట్టుకు రావచ్చని ఆలోచన చేసే కొంతమంది కార్మికుల పట్ల ఆ రాయితీల కొనసాగింపు వి | షయంలో యాజమాన్యం కఠినంగా వ్యవహరించే అంశాలను ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.
ఇకపై 150 మాస్టర్లు తప్పనిసరి..
కార్మికుల గైరాజర్ సమస్యను పరిష్కరించడం కోసం సింగరేణి యాజమాన్యం కొత్త సర్క్యులర్ను తెరపైకి తెచ్చింది. ఇకపై ఏడాదిలో 150 రోజులు కచ్చితంగా పని దినాలు ఉండాలని నిబంధనను తప్పనిసరిగా చేస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో సంవత్సరంలో 100 రోజులు పని దినాలు ఉండాలన్న నిబంధనను కంపెనీ ఇప్పడు మార్చింది.
సింగరె ణిలో ప్రతిరోజు వేల సంఖ్యలో కార్మికులు గైర్హాజరవుతుంటే ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించలేమన్న ఆలోచనతో ఏడాది ఖచ్చితంగా 150 మాస్టర్లు(150 masters) ప్రతి కార్మికుడు కలిగి ఉండాలని నిబంధనను సర్క్యులర్లో స్పష్టం చేసింది. 150 మాస్టర్ల కన్నా తక్కువగా ఉంటే నోటీసులు ఇవ్వడం, సమాధానం సంతృప్తికరంగా లేకుంటే వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించడం, అయినా మార్పు రాకుంటే ఉద్యోగం తొలగింపుకు చర్యలు చేపట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
చిన్న చిన్న కారణాలు.. చివరకు ఉద్యోగమే పోయే స్థితి..!
తల్లిదండ్రులు ఏళ్లపాటు కష్టపడి చేసిన ఉద్యోగం వారసుల భవిష్యత్తు కోసం వదులుకుంటున్నప్పటికీ యువ కార్మికులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా చిన్న చిన్న సంతోషాల కొ సం బంగారంలాంటి ఉద్యోగాన్ని కాలదన్నుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అష్టకష్టాలు(eight hardships) పడి ఉద్యోగాన్ని వారి చేతుల్లో పెడితే.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఓవైపు సంస్థ నష్టపోయే పరిస్థితికి తెస్తున్నారు.. మరోవైపు వారికి భవిష్యత్తు లేకుండా చివరకు ఉద్యోగాన్ని కోల్పోయే స్థితికి చేరుకుంటున్నారు. ఇప్పటికైనా తమకు అన్నం పెడుతున్న కంపె ఎనీ బాగు కోసం ఆలోచన చేయడంతోపాటు కుటుంబ సభ్యులను సంతోషంగా ఉండేలా చేసేందుకు మార్పు చెందుతారా…! సంస్థ పడుతున్న తాపత్రయానికి గైర్హాజరు కార్మికులు సహకరిస్తారో లేదా వేచి చూడాల్సిందే..!

