డీఎడ్ ను రద్దు చేయడం హాస్యాస్పదం..

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ విద్య కమిషన్ సమర్పించిన ప్రతిపాదనలో డీ.ఎడ్(డిప్లమా ఇన్ ఎడ్యుకేషన్) కోర్స్ రద్దు చేయాలని సిఫార్సు చేయడం హాస్యాస్పదం అని డీఎడ్, డీయస్సి అభ్యర్థుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బి. కమలాకర్ పేర్కొన్నారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన తెలంగాణ విద్యా విధానాలు 2026లోని ప్రతిపాదనలో డీఎడ్ (డిప్లమా ఇన్ ఎడ్యుకేషన్ ) ను రద్దు చేసి పూర్వ ప్రాథమిక పాఠశాలలో బి. ఎడ్, పీజీ ఉండాలనడం విద్యకమిషన్ సభ్యుల అవివేకము అని అన్నారు.
సుప్రీం కోర్టు ఎన్ సీటీఈ (నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్) ఉత్తర్వుల ప్రకారం ప్రాథమిక స్థాయి ఫాస్టూలకు కేవలం డీఎడ్ వారే అర్హులు అని, టెట్ పేపర్- 1 ఉన్నవారే డీఎస్సీ పరీక్షలు ఎస్జీటీ కి అర్హులు అని, విషయం తెలియక విద్యకమిషన్, డీఎడ్ రద్దు చేయలి అని సిపార్సు చేయడం దుర్మర్గమైన చర్య అని అన్నారు. గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి సి.యం వైయస్ రాజశేఖర్ రెడ్డి హయంలో ఎన్ సీటీఈ ఉత్తర్వుల ప్రకారం డీఎడ్ వారికే ప్రాథమిక ఉపాధ్యాయ పోస్ట్లు (ఎస్జిటి) అమలు చేసిందని గుర్తు చేశారు. జాతీయ స్థాయిలో డీఎడ్ అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తే అవగాహన రాహిత్యంతో మన రాష్ట్రంలో డీఎడ్ ను రద్దు చేయాలని సిఫారసు చేయడం సిగ్గుచేటని అన్నారు.
విద్యావ్యవస్థపై అవగాహన లేని సభ్యులతో కమిటీ వేసి సలహాలు తీసుకుంటే ఓ ప్రక్కన విద్యార్థుల జీవితాలు అదొగతి అవుతాయనీ మండి పడ్డారు. వెంటనే ప్రభుత్వ స్పందించి కమిటీ ఇచ్చిన డి.ఎడ్ రద్దు ప్రతిపాదనను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపాదనను రద్దు చేయకుంటే కొన్ని లక్షలమంది అభ్యర్థుల పరిస్థితి రోడ్డు పాలయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వ స్పందించి ప్రతిపాదన రద్దు చేయాలని లేని పక్షంలో డీఎడ్ అభ్యర్థులతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు,ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణ విద్య కమిషన్ కు, తెలంగాణ విద్యా శాఖ మంత్రి గా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలోని పాఠశాలలను పరిశీలించి మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని డిమాండ్ చేశారు.
