సామూహిక వివాహాలకు అభిమన్యు గ్రూప్ సరుకుల విరాళం

సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని మహాగం గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా ఆదివాసీ సమాజంలో తక్కువ ఖర్చుతో పేద కుటుంబాలకు సంత్ శ్రీసురోజి బాబా ఆశ్రమంలో మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 16న 25 పేదకుటుంభలకు సామూహిక వివాహాలకు అభిమన్యు గ్రూప్ తరుపున నిధులు జమ చేసి వచ్చే భక్తులకు అన్నదానం కార్యక్రమం కొరకు నిత్యావసర వస్తువులు సామూహిక వివాహాల కమిటీ సభ్యులకు అందజేశారు. అభిమన్యు గ్రూప్ సభ్యులకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాత్ రావు మాట్లాడుతూ మహాగాంలో శ్రీ సూరజ్ బాబా ఆశ్రమంలో ఎన్నో సంవత్సరాలుగా ప్రతి ఏడాది శివరాత్రి సందర్భంగా సామూహిక వివాహాలు నిర్వహించడం అర్షనీయమన్నారు.

నిరుపేద జంటలకు సామూహిక వివరాలు జరపడం వల్ల వారు ఆర్థిక పరిస్థితిని చూసి అభిమన్యు గ్రూపు టీం నిర్వాకులు మెస్రం శేఖర్ బాబు, సభ్యులకు ఆయనతోపాటు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మంచి కార్యక్రమాలకు దాతలు ముందుకు రావడం సంతోషకరమని తక్కువ ఖర్చుతో నిరుపేదల వ్యూహాలు ప్రతి ఏడాది ఆశ్రమంలో జరగడం ఆశ్రమ కమిటీ వివాహకులు ప్రతి ఏడాది సామూహిక వివాహాలు జరపడం ఎంతో సంతోషకరమని ఆదర్శనీయమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మహాగం సర్పంచ్ జానే రావు, అభూమాన్యు టీం నిర్వహికుడు మెశ్రం శేఖర్ బాబు, ఉపాద్యాయులు లింగు, దత్తు, దేవ్ రావు, బ0డు, కాంగ్రెస్ యువ నాయకులు మెశ్రం అంబాజి రావు, సర్ మెడి ఆనంద్ రావు, నాయకులు కమిటీ సభ్యులు సీతారాం, కృష్ణ మూర్తి,యాదవ్ రావు, మండల సర్పంచులు నగేష్, భూపతి, ఉయిక చందన్ షావ్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply