Abhilasha Abhinav | పోలింగ్ కేంద్రాన్ని పర్యవేక్షించిన కలెక్టర్
Abhilasha Abhinav | ముధోల్, ఆంధ్రప్రభ : ముధోల్ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పరిశీలించారు. ముధోల్ మండలంలోని ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన 16 వార్డులకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సరళిని పోలింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ (Polling) కేంద్రం వద్ద దొంగ ఓట్లను వేయడానికి ఓటువేసిన అనంతరం చేతి వేలికి వేసిన సిరాను ఒక రసాయనంతో తొలగిస్తూ ఇంటలిజెన్స్ పోలీసులకు దొరికిన నయాబాదికి చెందిన ఆర్భాజుద్దీన్ పై రాష్ట్ర ఎన్నికల నియమావలి ప్రకారం కేసులు నమోదు చేయాలని ముధోల్ మండల తహసీల్దార్, ఎస్.ఐ పెర్సిస్, ఎన్నికల ఆర్.ఓ లను కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. స్వాధీనం చేసిన రసాయనంను టెస్ట్ ల్యాబ్ కు పంపించాలని సూచించారు. పోలింగ్ పూర్తయిన పోలింగ్ కేంద్రాలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని సూచించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 1 గంట ముగిసేసరికి సుమారు 75శాతం పోలింగ్ జరిగింది. ఒంటి గంట తర్వాత పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.


