కార్వాన్. ఏప్రిల్ 16 (ఆంధ్ర ప్రభ) : మామిడికాయలు కోస్తూ ప్రమాదవశాత్తూ కాలుజారి కింద పడి యువకుడు మృతిచెందిన ఘటన గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవోదయాకాలనీలో చోటుచేసుకుంది. జలమండలి డివిజన్ 3 కార్యాలయంలో గల వాటర్ ట్యంక్ మెట్ల మీదనుంచి కిషోర్ (35) మామిడి కాయలు కోస్తూ ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడి మరణించిన సంఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వేళితే.. జలమండలి డివిజన్ 3 కార్యాలయంలో స్వీపర్ గా పనిచేస్తున్న సుశీల ఆరోగ్యం బాగలేని కారణంగా తన కొడుకు అరున్ స్వీపర్ గా వస్తున్న సమయంలో దగ్గరి బందువు కిషోర్ వెంట రావడం జరిగిందని తెలిపారు. ఈ తరుణంలొ వాటర్ ట్యాంక్ మెట్లకు ఆనుకొని ఉన్న సుమారు 25అడుగుల ఎత్తులో పిట్టగోడ ఆసరా చేసుకుని మామిడికాయలు కోస్తున్న సమయంలో కిషోర్ కాలుజారి కింద పడి చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతుడి బాడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగిందని పోలీసులు పేర్కోన్నారు.