దుర్గమ్మకు పురాణపండ ‘శ్రీమాలిక’ తో అద్భుత శ్రీపదార్చన !

  • చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల శ్రేయస్సుకోసం జనసేన నేతల సమర్పణ

విజయవాడ : గోరంత భక్తి పొంగే వారింట కొండంత కటాక్షం కురిపించే మహాస్వరూపం, మహా శక్తి , మహానుగ్రహం బెజవాడ కనకదుర్గమ్మ చరణాల చెంతకు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అనుచరగణమైన జనసేన శ్రేణులు ఒక నాలుగు వందల పేజీల అపురూపాన్ని మహాద్భుత మంత్ర పేటిక ‘ శ్రీమాలిక ‘ గ్రంధంగా వేల వేల ప్రతులు సమర్పించడం ఈ ఆషాడంలో ప్రత్యేక విశేషంగా పేర్కొనాలి.

కార్యనిర్వహణాధికారి కుర్చీలో కూర్చుని అతి తక్కువ సమయంలో సర్వ సమర్థునిగా అన్ని వర్గాల చేత చక్కని కీర్తిని అమ్మవారి అనుగ్రహంతో సంపాదించుకున్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఇ.ఓ. శీనా నాయక్ గురువారం ఉదయం ఈ ప్రతులను అమ్మవారి సమక్షంలో స్వీకరించారు.

ప్రముఖ రచయిత, శ్రీశైలదేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ పరమాద్భుత మంత్ర విద్యలతో, స్తోత్ర విద్యలతో భక్తి నిండిన హృదయాలకు ‘ శ్రీమాలిక ‘ మహా గ్రంథ పరిమళాన్ని పదికాలాలపాటు పదిలపరుచుకుని పఠనం చేసేలా, కలకాలం నిలిచేలా ఒక మహా వైభవంగా రచించి సంకలనం చేసిన ఈ ‘ శ్రీమాలిక ‘ గ్రంధాన్ని జనసేన శ్రేణులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ల సారధ్యంలో రాష్ట్రం ప్రగతి పధంలో దూసుకుపోయి, సుసంపన్నమవ్వాలనే ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ల చిత్రాలను ముద్రించి మరీ శ్రీమాలిక బుక్ ను అద్భుతంగా అపూర్వంగా అందించడం విశేషం.

ఈ సందర్భంగా శీనా నాయక్అం మాట్లాడుతూ అంతరంలోని అలజడులు నశింపచేసి ఆరోగ్యకర భావనతో మంగళమయంగా జీవనాన్ని సాగించడానికి ఎంతో అపురూపంగా, అపూర్వంగా పురాణపండ శ్రీనివాస్ ఈ మహాగ్రంధాన్ని అందించడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖామంత్రి ఆనంరామనారాయణరెడ్డి, కమీషనర్ రామచంద్రమోహన్ ల ప్రోత్సాహంతో అతి అరుదైన వందమంది అమ్మవార్ల అఖండ చిత్రాలతో , పరమ రమణీయంగా శ్రావణ మాసారంభంలో ‘ మంగళ ‘ దివ్య గ్రంధాన్ని అందిస్తున్నలు ఆలయ వర్గాలు పేర్కొన్నాయి.

Leave a Reply