నర్సాపురం వీధుల్లో కదం..

నర్సాపురం వీధుల్లో కదం..

నర్సాపురం, ఆంధ్రప్రభ : మొంథా తుఫాన్ లో త్వరితగతిన గతిని సేవలు అందించేందుకు విద్యుత్ శాఖ అప్రమత్తం అయ్యింది. సబ్ స్టేషన్ లో ఉన్న సిబ్బందికి మన జిల్లా తో బాటు ఇతర జిల్లాల నుంచి ప్రత్యేక బృందాలు నర్సాపురం నకు చేరుకున్నాయి.

కడప, అనంతపురం, సత్యసాయి, గుంటూరు, విజయనగరం తదితర ప్రాంతాలకు కు చెందిన విద్యుత్ సిబ్బంది తీర ప్రాంతంలో సేవలు అందించేందుకు రంగంలోకి దిగారు. ఒక ఏ ఈ నేతృత్వంలో 12మంది సిబ్బంది తో కూడిన 59బృందాలు ప్రస్తుతం నర్సాపురం చేరుకున్నాయి.

ఇంకా మరిన్ని బృందాలు రానున్నాయని డీ ఈ తెలిపారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల ఒరిగిన యడల సమాచారం అందించిన వెంటనే తక్షణ చర్యలు చేపట్టడానికి ఈ బృందాలు దోహద పడతాయని డి ఈ మధుకుమార్ తెలిపారు.

పడిపోయిన స్తంభాలు స్థానే 2500 కొత్త విద్యుత్ స్తంభాలను సిద్ధం చేశామన్నారు. అత్యవసర పనులు తప్పితే గానీ అనవసరంగా బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరిక లు జారీ చేసిందని తెలిపారు. తుఫాన్ తీవ్రత గంట గంటకు పెరిగి ఈదురు గాలులు వీస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Leave a Reply