జమ్మూ కశ్మీర్ : జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) లోని కుల్గాం జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్ (Encounter) లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. దీనికి సంబంధించిన వివరాలను భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్స్ (Chinar Corps) వివరాలు అందించింది. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. రాత్రి నుంచి ఉగ్రవాదులు, సైన్యం మధ్య తీవ్రమైన కాల్పులు జరుగుతున్నాయి. మరింత ధీటుగా బదులిస్తన్న సైన్యం ఉగ్రవాదుల (Terrorists) పై ఉక్కుపాదం మోపింది. అని చినార్ కార్ప్స్ Xలో తెలిపింది. ఇప్పటివరకు ఒక ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఆపరేషన్ అఖల్ కొనసాగుతోందని వివరించింది.
దక్షిణ కాశ్మీర్ (South Kashmir) జిల్లాలోని అఖల్‌లో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా దళాలు ఆపరేషన్ (operation) ప్రారంభించింది. దీన్ని గమనించిన ఉగ్రవాదులు సైన్యం పైకి కాల్పులు చేయడం ప్రారంభించాయి. ఉగ్రవాదులకు ధీటుగానే భారత్ సైన్యం బదులిచ్చింది. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు, CRPF, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) పాల్గొన్నాయి.
ఉగ్రవాదిని హతమార్చినప్పటికీ ఇంకా ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు దాక్కుని ఉండవచ్చని భారత సైన్యం చినార్ కార్ప్స్ తెలిపింది. పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam terror attack) తర్వాత భద్రతా దళాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. అందులో భాగంగానే అనుమానం ఉన్న ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నారు. అలానే అఖ్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. అనుమానాస్పద కదలికలు గుర్తించి అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఒక ఉగ్రవాదిని హతమార్చాయి. హతమైన ఉగ్రవాది గుర్తింపు ఇంకా నిర్ధారించలేదు. వీళ్లంతా లష్కరే తోయిబా (Lashkar-e-Taiba) ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నారు. వీరి కోసం గాలిస్తున్న సైన్యంపై కాల్పులు జరుపుతున్నారు.