సత్యజ్యోతికి అశ్రునివాళి..

- శాప్ చైర్మన్ రవి నాయుడు..
ఆంధ్రప్రభ, విజయవాడ : విజయనగరానికి చెందిన జాతీయ వెయిట్‌లిఫ్టర్ సత్య జ్యోతి అకాల మృతి పట్ల శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అనిమిని రవినాయుడు మాట్లాడుతూ సత్య జ్యోతి రాష్ట్రానికి గర్వకారణమైన క్రీడాకారిణి. ఆమె అకస్మాత్తుగా చనిపోవడం అత్యంత బాధాకరం. రాష్ట్రం ఒక ప్రతిభాశాలి, అంకితభావంతో కృషి చేసిన క్రీడాకారిణిని కోల్పోయిందని, ఆమె ఆంధ్రప్రదేశ్‌కు సాధించిన విజయాలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలుస్తాయి అని ఆయన పేర్కొన్నారు. అలాగే సత్య జ్యోతి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో దేవుడు వారికి ధైర్యం ప్రసాదించాలని రవినాయుడు కోరుకున్నారు.
