AP | వల్లభనేని వంశీకి స్వల్ప ఊరట
గన్నవరం – ఆంధ్రప్రభ : వైసీపీ నేత వంశీ బెయిల్ ఆంక్షల్లో ఏసీబీ కోర్టు (ACB court) బుధవారం స్వల్ప మార్పులు చేసింది. సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో నెలలో రెండో శనివారం పటమట పీఎస్ కు వెళ్లి సంతకం చేయాలని ఆదేశించింది.
గతంలో 2, 4వ శనివారాలు పీఎస్ లో సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో తన బెయిల్ (bail) ఆంక్షలు సడలించాలని వంశీ పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం నెలలో రెండో శనివారం (second Saturday) వెళ్లి సంతకాలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

