అలా చేస్తేనే.. సురక్షిత భవిష్యత్తు..

అలా చేస్తేనే.. సురక్షిత భవిష్యత్తు..
- సైబర్ నేరాల పట్ల జాగ్రత్త..
- టోల్ ఫ్రీ నంబర్ 1930 ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి..
- సర్పంచ్ ఏడాకుల సరోజన సంపత్..
- యూనియన్ బ్యాంక్ మేనేజర్ నగేష్ల పిలుపు..
నల్లబెల్లి, ఆంధ్రప్రభ : ఆర్థిక అక్షరాస్యత పై మండలంలోని మామిండ్ల వీరయ్య పల్లి గ్రామంలో గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ ఏడాకుల సరోజన సంపత్, నల్లబెల్లి యూనియన్ బ్యాంక్ శాఖ మేనేజర్ నాగేష్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్థికంగా, సురక్షితంగా ఉండాలంటే.. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ KYCని మీ బ్యాంకు అధికారులను తెలుసుకొని మీ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి అని సూచించారు. ఇది మీ ఆర్థిక లావాదేవీలను సురక్షితంగా ఉంచుకోవడానికి చాలా అవసరం అని గుర్తు చేశారు. అలాగే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటే మీ ఆర్థిక ఎదుగుదలకు, భద్రతకు ఎంతగానో తోడ్పడతాయి.
వాటి గురించి తెలుసుకొని, సరైన విధానంలో దరఖాస్తు చేసుకోండని సూచించారు. ముఖ్యంగా నేటి కాలంలో సైబర్ నేరాలు చాలా పెరిగిపోయాయి. వీటి పట్ల ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని వ్యక్తులకు మీ బ్యాంక్ వివరాలు, OTPలు, పాస్వర్డ్లు షేర్ చేయవద్దు అది గుర్తుంచుకోండి అన్నారు.
మీ బ్యాంక్ లేదా ఏ ప్రభుత్వ సంస్థ కూడా ఫోన్ కాల్స్ లేదా మెసేజ్ల ద్వారా మీ వ్యక్తిగత ఆర్థిక వివరాలను అడగదు. ఒకవేళ మీరు పొరపాటున సైబర్ నేరాలకు గురైతే, భయపడకుండా తక్షణమే టోల్ ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేయండి అని సూచించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ బ్యాంకు మిత్ర అడ్డగట్ల శంకర్, సంధ్య, ఫైనాన్షియర్ లిటరసి కౌన్సాలర్స్ హైమావతి, సాయికుమార్, రమేష్, గ్రామస్తులు, రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
