హైదరాబాద్, ఆంధ్రప్రభ : హాస్య బ్రహ్మ, ప్రముఖ హాస్యావధాని శంకర నారాయణ వండర్ బుక్ అఫ్ రికార్డ్స్ (Wonder Book of Records)లో స్థానం సంపాదించుకున్నారు. త్యాగరాయ గానసభ కళాసుబ్బారావు కళావేదికలో బుధవారం నాడు జరిగిన కార్యక్రమంలో త్యాగరాయ గాన సభ అధ్యక్షుడు కళాజనార్దన మూర్తి, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ ఇండియా చీఫ్ కో-ఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్(Bingi Narender Goud), శంకర నారాయణకు ఈ రికార్డ్ ప్రదానం చేశారు.
దేశ విదేశాల్లో వేలాది హాస్య కార్యక్రమాలు నిర్వహించిన శంకర నారాయణ(Shankara Narayana) గత 27సంవత్సరాల నుంచి 550 హాస్యావధానాలు చేశారని, త్యాగరాయ గానసభ(Thyagaraya Gana Sabha)లోనే 25 గంటల పాటు నిర్విరామ ప్రజా హాస్యావధానం నిర్వహించారని వీటిని గుర్తించి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్ నేషనల్ వారు రికార్డ్ ఇచ్చారని నరేందర్ గౌడ్, కళా జనార్దన్ మూర్తి తెలియజేశారు.
శంకర నారాయణ ప్రపంచ వ్యాప్తంగా హాస్యావధానాలు(Humorous Notes) చేసి మరిన్ని అవార్డులు, రికార్డులు సాధించి మరిన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని జనార్థన మూర్తి ఆకాంక్షించారు.