ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిరక్షించండి

ఆంధ్రప్రభ ప్రతినిధి,భూపాలపల్లి: తెలంగాణ(Telangana)లోని సింగరేణి సీ అండ్ ఎండీ బలరాం(MD Balaram), 20 వేలకు పైగా మొక్కలు నాటిన తొలి సివిల్ సర్వీసెస్ అధికారిగా అరుదైన రికార్డ్ సృష్టించారు. భూపాలపల్లిలోని మిలీనియం క్వార్టర్స్ వెనక ఉన్న సింగరేణి నర్సరీ(Singareni Nursery) మైదానంలో ఆదివారం సింగరేణి ఆధ్వర్యంలో వన మహోత్సవం(Forest Festival) నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(Gandra Satyanarayana Rao) హాజ‌రై మొక్క నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంలో బలరాం 370 మొక్కలు నాటి ఈ మైలురాయిని చేరుకున్నారు. పర్యావరణ(environmental) పరిరక్షణ కోసం అందరూ మొక్కలు నాటాలని ఎమ్మెల్యే, సీఎండీ పిలుపునిచ్చారు. ఈ చరిత్రాత్మక సాధనపై ఎమ్మెల్యే జిఎస్ఆర్ బలరాం(MD Balaram)ను అభినందించారు. కార్యక్రమంలో భూపాలపల్లి సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply