Female baby | ఎవ‌రిదీ పాపం..

ఎవ‌రిదీ పాపం..

మురుగుకాల్వలో గర్భస్థ ఆడ శిశువు లభ్యం..!

female baby |మిర్యాలగూడ, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో అమానవీయ సంఘటన బుధవారం వెలుగుచూసింది. మిర్యాలగూడ పట్టణంలోని షాబునగర్ లో గల మురుగుకాల్వలో గర్భస్థ ఆడ శిశువు మృతదేహం లభ్యమైంది. పారిశుద్ధ్య కార్మికుడు మురుగుకాల్వలో చెత్తను తొలగించే క్రమంలో కవర్ లో చుట్టి ఉన్న శిశువు మృతదేహం బయటపడింది.

స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు, వన్ టౌన్ సీఐ నాగభూషణంలు దర్యాప్తు చేస్తున్నారు. ఆడ శిశువు కావడంతోనే అబార్షన్ చేయించి కాల్వలో పడవేసి వేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. మానవత్వం మరిచి ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply