వెలుగుల‌తో నిండిన ప‌వ‌ర్‌గూడ‌…

వెలుగుల‌తో నిండిన ప‌వ‌ర్‌గూడ‌…

ఉట్నూర్/ జైనూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధులు మంజూరు చేయకపోవడంతో కనీసం పంచాయతీలలో విద్యుత్ స్తంభాలకు విద్యుత్ దీపాలు పెట్టలేని పరిస్థితి నెలకొంది. రోజులు, నెలల తరబడి కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పవర్ గూడ గ్రామపంచాయతీ అందాకారంలో ఉండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు.

ఈ విషయం దృష్టిలో పెట్టుకొని అదే గ్రామానికి చెందిన రాజ్ గోండు సేవా సమితి జైనూర్ మండల అధ్యక్షుడు తొడసం రాజేందర్(Thigh Rajender) ప్రత్యేక చొరవ తీసుకొని టీపీసీసీ(TPCC) ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క దృష్టికి తేవడంతో ఆమె సహకారంతో సొంత డబ్బులతో ఈరోజు ఆ గ్రామంలోని విద్యుత్ స్తంభాలకు నూతన బల్బులు అమర్చి గ్రామంలో అందాకారాన్ని తొలగించి గ్రామం వెలుగులతో నింపారు. ఆ యువకుడు చేసిన కృషిని గ్రామస్తులు అభినందించారు.

పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని సేవ చేయాలనే తపన ఉంటే సేవ చేయొచ్చని ఆ యువకుడు నిరూపించుకున్నాడు. విద్యుత్ స్తంభాలకు విద్యుత్ బల్బులు(electric bulbs) మార్చడంతో ఆ గ్రామంలో లుగులు నిరవడంతో గ్రామస్తులు తొడసం రాజేందర్ కృషిని అభినందించారు. రోజుల తరబడి అందాకారంలో ఉన్న గ్రామంలో వెలుగులు తెచ్చారని గ్రామస్తులు తెలిపారు.

Leave a Reply