పౌరసరఫరాలో నూతన అధ్యాయం

పౌరసరఫరాలో నూతన అధ్యాయం

మంత్రి స్వామి

ఒంగోలు రూరల్, ఆంధ్రప్రభ : స్మార్ట్ కార్డులు పౌర సరఫరాలలో నూతన అధ్యాయం అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులో రేషన్ లబ్ధిదారులకు మంత్రి స్మార్ట్ రేషన్ కార్డులు శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్మార్ట్ కార్డులో కుటుంబ సభ్యుల సమగ్ర వివరాలు ఉంటాయ‌న్నారు. దుర్వినియోగానికి అడ్డకట్ట వేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని చెప్పారు. కూట‌మి ప్ర‌భుత్వ 16 నెలల పాలనలో జిల్లాలో 20వేలకు పైగా కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన‌ట్లు పేర్కొన్నారు. అర్హులందరికీ కార్డులు, రేషన్ సరుకులు అందేలా చర్యలు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ పలువురు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply