Breaking | ఢిల్లీలో మరోసారి…

Breaking | ఢిల్లీలో మరోసారి…

ఢిల్లీ, ఆంధ్రప్రభ: ఇటీవల పేలుడు ఘటనలతో ఉలిక్కిపడిన ఢిల్లీలో మరోసారి (once again) భారీ శబ్దం కలకలం రేపింది. గురువారం ఉదయం మహిపాల్‌పూర్‌లోని రాడిసన్ హోటల్ (Radisson Hotel) సమీపంలో వినిపించిన శబ్దంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరో పేలుడా అని ఆందోళన చెందారు. అయితే, అగ్నిమాపక శాఖ అధికారులు తక్షణమే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఉదయం 9:18 గంటలకు వచ్చిన ఫోన్ కాల్ (phone call) పై విచారణ చేసి, ఆ శబ్దం బస్సు టైర్ పేలడం వల్ల వచ్చిందని, పేలుడు కాదని స్పష్టం చేశారు. దీంతో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఉగ్రవాద కుట్రల ఆరోపణల నేపథ్యంలో ఎలాంటి శబ్దమైనా భయాన్ని కలిగిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. అధికారులు భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేస్తున్నారు.

Leave a Reply