శ్రీ సత్య సాయి బ్యూరో, (ఆంధ్రప్రభ) : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ పరిధిలోని కాలసముద్రం వద్ద ఓ లారీ దగ్ధమైపోయిన ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే…
తమిళనాడుకు చెందిన ఒక లారీ అనంతపురం నుండి చెన్నై వైపు వెళుతోంది. ప్రయాణం మధ్యలో కాలసముద్రం వద్ద డ్రైవర్ లారీని ఆపి, భోజనం సిద్ధం చేసుకోవడానికి లారీలోని చిన్న గ్యాస్ స్టవ్ వెలిగించాడు. అయితే, అకస్మాత్తుగా, గ్యాస్ స్టవ్ నుండి మంటలు చెలరేగి లారీ అంతటా వ్యాపించాయి.

మంటలు వేగంగా వ్యాపించి లారీని పూర్తిగా చుట్టుముట్టాయి, దీంతో డ్రైవర్ ప్రాణ భయంతో లారీ నుంచి దూకాడు. ఆ తర్వాత మంటలు అదుపు తప్పి లారీ మొత్తాన్ని దగ్ధం చేశాయి.

కదిరి రూరల్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో అతను ప్రాణాలతో బయటపడడం పెద్ద అదృష్టంగా పోలీసులు పేర్కొన్నారు. ఇక‌ మంటలు ఎలా చెలరేగాయనే దానిపై మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని వారు తెలిపారు.

Leave a Reply