తీరంలో చిరుజల్లులు షురూ

(ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్) : మొంథా (Montha) అవులించింది.. నిద్ర లేచింది.. చిరుజల్లులతో రెడీ అవుతోంది. ఇప్పటికే నెల్లూరు, ఒంగోలు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్ను గోదావరి జిల్లాల్లో వర్షపు జల్లులు జోరందుకొంటున్నాయి.

కృష్ణా జిల్లా (KrishnaDistrict) మచిలీపట్నం, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం .. తూర్పు గోదావరి కాకినాడలో వర్షం జోరందుకుంది. ఈదురు గాలులు ప్రారంభం కాలేదు. ఇక ఎన్డీఆర్ ఎఫ్, ఎస్డీఆర్ ఎఫ్ దళాలు లోతట్లు ప్రాంతాల్లోనూ, సముద్ర తీరంలో మెరైన్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే అప్రమత్తమైన అధికారయంత్రాంగం కమాండ్ కంట్రోల్ లో నిశితంగా పరిశీలిస్తున్నారు.

Leave a Reply