ఆలేరులో హరీష్ రావుకు ఘన స్వాగతం..

ఆలేరు, ఆంధ్రప్రభ : వరంగల్ పర్యటనకు వెళ్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం పరిధిలోని బైపాస్ రోడ్డు వద్ద మంగళవారం మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గుండ్ల గూడెం గ్రామ శాఖ బిఆర్ఎస్ అధ్యక్షులు గంపల విజయ్, మాజీ సర్పంచ్ ఏసిరెడ్డి మహేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ సాయి నాయక్, ఆలేటి నాగార్జున, గజ్జల మధుసూదన్ రెడ్డి తదితరులు హరీష్ రావుకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. తనకు ఆత్మీయంగా స్వాగతం పలికిన గుండ్ల గూడెం పార్టీ శ్రేణులకు హరీష్ రావు కృతజ్ఞతలు తెలిపారు.
