ఘనంగా బ‌తుక‌మ్మ వేడుక !!

హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ వ‌ద్ద‌ పీపుల్స్ ప్లాజాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో వేలాది మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆడ‌ప‌డుచులంద‌రూ బతుకమ్మ చుట్టూ డ్యాన్స్ చేస్తూ.. బతుకమ్మ పాటలు పాడుతూ ఈ పండుగకు ప్రత్యేక శోభ తీసుకొచ్చారు.

ఈ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు హాజరయ్యారు. కేటీఆర్ కూడా మహిళలతో కలిసి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ, ఈ పూల పండుగలో భాగమయ్యారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే పీపుల్స్ ప్లాజా పేరును ‘బతుకమ్మ ప్లాజా’గా మారుస్తామని హామీ ఇచ్చారు. అలాగే, బతుకమ్మ పండుగ ప్రాముఖ్యత గురించి వివరిస్తూ, “దుబ్బాకలో ఉన్నా, దుబాయ్‌లో ఉన్నా… వారసిగూడలో ఉన్నా, వాషింగ్టన్‌లో ఉన్నా… అమీర్‌పేట్‌లో ఉన్నా, అమెరికాలో ఉన్నా… ఖైరతాబాద్‌లో ఉన్నా, ఖతర్‌లో ఉన్నా… ఎక్కడున్నా బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలి. మనమందరం పోరాడి సాధించుకున్న తెలంగాణ ఆత్మగౌరవానికి బతుకమ్మ పండుగ ప్రతీక” అని పేర్కొన్నారు.

Leave a Reply