వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : భద్రాచలం (Bhadrachalam) లోని ఓ ప్రైవేట్ లాడ్జిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసి ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అశ్వాపురం (Ashwapuram) మండలానికి చెందిన ఒక బాలిక, కుకునూరు మండలానికి చెందిన ఓ యువకుడు గురువారం లాడ్జిలో గది బుక్ చేసుకున్నారు.
ఇవాళ ఉదయం ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి (Suicide Attempt) పాల్పడ్డారు. వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. చికిత్స పొందుతున్న బాలిక కూడా కొద్ది సేపటికే ఐసీయూ (ICU) లో ప్రాణాలు విడిచింది.
మృతుడైన యువకుడు ఇప్పటికే వివాహం చేసుకుని ముగ్గురు పిల్లలకు తండ్రిగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు, బాలిక ఎనిమిదో తరగతి చదువుతోందని, వీరిద్దరి మధ్య ప్రేమ సంబంధం ఉన్నట్టు బంధువులు (Relatives) చెబుతున్నారు. ఇదే కారణంగా ఈ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు (Police) ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.