కనకదుర్గమ్మవారికి బంగారు కానుక

కనకదుర్గమ్మవారికి బంగారు కానుక
విలువైన మంగళసూత్రాలు కానుక
ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం హలో నీ కనకదుర్గమ్మకు భక్తుడు నాలుగు లక్షల విలువైన బంగారు మంగళ సూత్రాలను కానుకగా సమర్పించారు. కర్నూలు జిల్లాకు చెందిన భక్తుడు బోయే వెంకటేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని, ఆలయానికి భారీ విరాళాన్ని సమర్పించారు.
భక్తుడు 30 గ్రాముల బంగారుతో తయారు చేసిన మంగళసూత్రాలను కానుకగా సమర్పించగా, వాటి విలువ సుమారు ₹4 లక్షలుగా అంచనా. మునగాలపాడు గ్రామానికి చెందిన వెంకటేష్ కుటుంబం ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ కానుకను అందజేసింది. ఆలయ ఏఈఓ బి.వి. రెడ్డి ఈ బంగారు మంగళసూత్రాలను స్వీకరించి, దాత కుటుంబానికి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు.
