రోడ్డుపై బండరాయి..

  • జిహెచ్ఎంసి ఆటో ధ్వంసం

హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : గౌతమ్ నగర్, మల్లికార్జున నగర్ ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న గుట్టపై నుంచి ప్రమాదవశాత్తు భారీ బండరాయి కిందపడింది. దీంతో రోడ్డు పక్కన పార్క్ చేసిన ఇంటింటి చెత్త సేకరణ జిహెచ్ఎంసి ఆటో రిక్షా పూర్తిగా ధ్వంసమైంది.

సమాచారం తెలుసుకున్న గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనను స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, అధికారులను అప్రమత్తం చేశారు.

ధ్వంసమైన ఆటో బాధితులకు త్వరగా కొత్త ఆటో కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. అలాగే రోడ్డుపై బండరాయి ఉండటం వల్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా తక్షణమే రోడ్డు క్లియర్ చేయాలని జిహెచ్ఎంసి, రెవెన్యూ, ఎమ్మార్వో, హైడ్రా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

బాధితులకు పూర్తి సహాయం అందిస్తామని హామీ ఇచ్చిన కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్‌తో పాటు నాయకులు రాము యాదవ్, బైరు అనిల్, సిద్ధిరాములు, కావలి శ్రీనివాస్‌, జీహెచ్‌ఎంసీ అధికారులు అంహో మంజుల, ఏఈ దివ్య జ్యోతి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply