కళ్యాణ లక్ష్మి పథకం
రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
234 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
మక్తల్, అక్టోబర్ 22(ఆంధ్రప్రభ) : తెలంగాణలోని పేదింటి ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి (KalyanaLakshmi) పథకం ఒక వరం లాంటిదని రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి (Vakkiti Srihari) అన్నారు. బుధవారం మధ్యాహ్నం నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద 234 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి పథకం ద్వారా పేదింటి ఆడబిడ్డల పెళ్ళిళ్లకు ఎంతో ఆసరాగా ఉంటుందన్నారు. పేదరికం కారణంగా ఆడపిల్లల పెళ్లిళ్లు చేయలేని తల్లిదండ్రులకు ఈ పథకం ఎంతో అండగా ఉంటుందన్నారు.
రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదింటి ఆడబిడ్డకు ఈ పథకం కింద ఒక లక్ష 116 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నామని అన్నారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 3,000 కు పైగా మందికి కళ్యాణ లక్ష్మి ద్వారా ఆర్థిక సాయం అందించినట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ (Collector Sanchit Gangwar), ఆర్ డి ఓ రామచంద్రనాయక్, డిటి పుష్పలత, మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హనుమంతు, మాజీ జెడ్పిటిసి జి, లక్ష్మారెడ్డి ,మార్కెట్ వైస్ చైర్మన్ బి, గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మండలం వ్యవసాయ కార్యాలయం వద్ద మండల పరిధిలోని చిన్నగోపులాపూర్ కు చెందిన 25 మంది రైతులకు ఉచిత వేరుశనగ విత్తనాలను మంత్రి వాకిటి శ్రీహరి అందజేశారు .ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మిథున్ చక్రవర్తి ఏఈవోలు పాల్గొన్నారు.