సినిమా ప్రేక్షకులు ఊహించని విధంగా ఒక చిన్న బడ్జెట్ యానిమేషన్ డివోషనల్ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర మెగా హీరోల సినిమాలకే సవాల్ విసురుతోంది.
మహావతార్ నరసింహ 5వ వారం కూడా బాక్సాఫీస్ వద్ద తన జోరు కొనసాగిస్తోంది. రాజనీకాంత్ కూలీ.. ఎన్టీఆర్–హృతిక్ రోషన్‌ల వార్ 2 లాంటి పెద్ద బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయినా, ఈ చిన్న సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే దుమ్ము రేపుతోంది. BookMyShow యాప్‌లో కూడా ఈ సినిమాకే టాప్ టికెట్ సేల్స్ వచ్చాయి.
వసూళ్ల పరంగా చూస్తే .. ‘కూలీ’ ఇప్పటివరకు వరల్డ్‌వైడ్‌గా దాదాపు రూ.445 కోట్లు దాటింది. ‘వార్ 2’ సుమారు రూ.305 కోట్లు వసూలు చేసింది. అయితే ఈ రెండింటికి ‘మహావతార్ నరసింహ’ గట్టి పోటీ ఇస్తూ, ఇప్పటికే రూ.280 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఈ సినిమా వేగంగా రూ.300 కోట్ల క్లబ్ వైపు పరిగెడుతోంది
రెండవ వీకెండ్ లో పెద్ద స్టార్ పవర్ ఉన్న సినిమాలు బలహీనపడినప్పటికీ, మహావతార్ నరసింహ ఇప్పటికీ బాక్సాఫీస్ బ్యాటిల్ లో పోరాడుతోంది.