BRS | బ్లాక్ లిస్టులో ఉన్న ఇండ్లను తొలగించాలి…

BRS | బ్లాక్ లిస్టులో ఉన్న ఇండ్లను తొలగించాలి…

  • తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన

BRS | మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన 645 ఇండ్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ ఎస్ నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు. పేదలకు చెందిన ఇండ్లను బ్లాక్ లిస్టులో పెట్టడం ఎంతవరకు సమంజసమని, తక్షణమే అట్టి ఇండ్లను బ్లాక్ లిస్టులో నుండి తొలగించాలని తహశీల్దార్ జ్యోతిని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూ దందాకు పాల్పడుతుందని తక్షణమే విచారణ చేసి పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్ కి వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ మండల, పట్టణ అధ్యక్షుడు పొన్నెబొయిన రమేష్, జంగ శ్రీను, మాజీ మార్కెట్ చైర్మన్ లు మహేంద్రనాధ్, యాకుబ్ రెడ్డి, మాజీ సర్పంచ్ బయ్యని పిచ్చయ్య, సీనియర్ నాయకులు మర్రి అనిల్ కుమార్, దాసరి తిరుమలేష్, మంచే గోవర్ధన్, పురుగుల మల్లయ్య, కోక బిక్షం, గజ్జి మల్లేష్, దేవా, బందెల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply