CRIME | ఆక్రమణలపై టాక్టికల్ అర్బనిజం ఉక్కుపాదం

CRIME | ఆక్రమణలపై టాక్టికల్ అర్బనిజం ఉక్కుపాదం
- వంతెన వద్ద తొలగించిన ఆక్రమణలు …
- పార్కింగ్ సదుపాయాలు సిద్ధం చేసిన డీసీపీ…
- స్వయంగా పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ షిరిన్ బేగం…
- సిబ్బందికి ముందస్తు చర్యలకు ఆదేశాలు..
CRIME | విజయవాడ, క్రైమ్, ఆంధ్ర ప్రభ : అంకమ్మ తల్లి జాతర సందర్భంగా వచ్చే భక్తులకు పార్కింగ్ సదుపాయం కల్పించేందుకు సిద్ధం చేస్తున్న ప్రదేశాన్ని డీసీపీ ట్రాఫిక్ షిరీన్ బేగం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… భక్తులకు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సమన్వయంతో విధులు నిర్వహించాలని తగు సూచనలు చేశారు. అలాగే అమ్మవారి ఊరేగింపు సందర్భంగా హైవేలో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ట్రాఫిక్ సిబ్బందికి ఆదేశించారు. టాక్టికల్ అర్బనిజం కార్యక్రమంలో భాగంగా రామవరప్పాడు చిన్న వంతెన వద్ద రోడ్డుకు ఇరువైపులా అక్రమంగా ఆక్రమించి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తున్న షాపులు, వ్యాపారాలను తొలగించి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగని ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో రామవరప్పాడు పంచాయతీ ఈఓ సత్యబాబు, రామవరప్పాడు అంకమ్మ తల్లి ఆలయ ఈఓ ప్రియాంక, ట్రాఫిక్ సీఐ రమేష్ కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

- వ్యాపారుల పట్ల మానవీయకోణం..
టాక్టికల్ అర్బనిజం చర్యలలో భాగంగా రోడ్డు ఆక్రమణలను తొలగించినప్పటికీ, చిన్న వ్యాపారస్తుల జీవనాధారానికి భంగం కలగకుండా వారికి చిన్న వంతెన సమీపంలోనే ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించడం జరిగింది. ఈ మానవీయ నిర్ణయంతో చిన్న వ్యాపారస్తులు ఆనందం వ్యక్తం చేయగా, ఇది డీసీపీ షిరిన్ బేగం మానవత్వం, ప్రజాప్రయోజనాల పట్ల ఉన్న బాధ్యతకు నిదర్శనంగా నిలిచింది.
