China Manja | మన ప్రాణాలు మన చేతిలోనే..

China Manja | మన ప్రాణాలు మన చేతిలోనే..

  • చైనా మంజా దారం ప్రాణాంతకం
  • ఉపయోగిస్తే కఠిన చర్యలు

China Manja | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : మన హిందువుల ముఖ్యమైన పండుగలు సంక్రాంతి పండుగ చాలా ప్రాముఖ్యత కలిగిన పండుగ. చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకునే సంక్రాంతి పండుగ ఆరోగ్యకరంగా శుభప్రదం గా జరుపుకోవాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. పోలీస్ శాఖ మాత్రం గాలిపటాలకు మాంజా దారాన్ని ఉపయోగించకూడదని హెచ్చరిస్తున్నారు.

దానివల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని కూడా పేర్కొంటున్నారు. విద్యుత్ శాఖ అధికారులు కూడా గాలిపటాలు ఎగురవేత‌లె జాగ్రత్తలు తీసుకోవాలని లేనిచో ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగురవేయడంలో వినియోగదారుల భద్రత అత్యంత ముఖ్యమని హెచ్చరిస్తున్నారు.

సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకుంటూనే, విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా వినియోగదారులందరూ కింది సూచనలను తప్పనిసరిగా పాటించాలని దక్షిణ విద్యుత్ పంపిణీ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. గాలిపటాలు ఎగిరేసే చిన్నలు, పెద్దలు పాటించవలసిన ముఖ్యమైన భద్రతా సూచనలు పాటించాల్సిన అవసరం ఉందన్నా రు.

China Manja

విద్యుత్ లైన్లకు దూరంగా ఉండండి…

గాలిపటాలను ఎప్పుడూ విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లకు దూరంగా ఉన్న బహిరంగ ప్రదేశాలలో మాత్రమే గురవేయాలన్నారు. గాలిపటాల దారాలు విద్యుత్ తీగలకు తగిలితే ప్రాణాపాయమైన విద్యుదాఘాతం ఎలక్ట్రిక్ షాక్ సంభవించే ప్రమాదం ఉందన్నారు.

లోహ పూత చైనీస్ మాంజా దారాలు వాడకూడదు…

ప్లాస్టిక్, నైలాన్ లేదా లోహపు పూత మెటలిక్‌ కోటింగ్ ఉన్న మంజా లేదా ‘చైనీస్ దారాలు’ విద్యుత్‌ను అత్యంత సులభంగా ప్రసరింపజేస్తాయన్నారు. ఇలాంటి దారాలు పొరపాటున విద్యుత్ లైన్లను తాకినప్పుడు, గాలిపటం ఎగురవేస్తున్న వారికే కాకుండా, చుట్టుపక్కల ఉన్నవారికి కూడా షాక్ తగిలే ప్రమాదం అధికంగా ఉంటుందన్నారు. కేవలం కాటన్ దారాన్ని మాత్రమే వాడాలని పేర్కొన్నారు.

చైనా మాంజాపై ప్రభుత్వం నిషేధం…

పర్యావరణ పరిరక్షణ చట్టం-1986 ప్రకారం, చైనా మాంజాను విక్రయించడం, వినియోగించడం చట్టరీత్యా నేరం అని పోలీస్ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీనికి 5 సంవత్సరాల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించవచ్చుఅన్నారు. నిషేధం ఉన్నా చైనా మాంజా దొంగచాటుగా అమ్ముతున్నారని షాపులపై దాడులు చేస్తున్నామని హెచ్చరించారు.

చైనా మాంజా దారం వినియోగం వల్ల పక్షులు, జంతువులు, మనుషులు ప్రమాదాల బారిన పడుతున్నారు. బైక్లపై వేగంగా వెళ్తున్నప్పుడు ఈ దారం మెడకు, ముఖానికి తగిలితే తీవ్ర గాయాలయ్యే ప్రమాదం ఉందన్నారు.ప్రజలు చైనా మాంజా వినియోగించవద్దని, విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply