Nandyala | ఇంటర్ సెకండియర్ ఇంగ్లీషు పరీక్ష పేపర్ లో తప్పులు…

  • గందరగోళంలో విద్యార్థులు..
  • వీటికి మార్కులు కలపాలి.. అధికారులపై చర్యలు తీసుకోవాలి…తల్లిదండ్రులు


నంద్యాల బ్యూరో, మార్చి 5 : రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు బుధవారం ఇంగ్లీష్ పేపర్ పరీక్ష నిర్వహించారు. ఇందులో రెండు ప్రధానమైన తప్పులను ప్రింట్ చేయడంతో విద్యార్థులు గందరగోళానికి గురైన సంఘటన జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంగ్లీషు పరీక్ష పేపర్ ప్రింటింగ్ విధానంలో తప్పులు దొర్లాయి. రెండు ప్రశ్నలు సక్రమంగా విద్యార్థులకు కనిపించకపోవడం, పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత సంబంధించి పరీక్ష నిర్వహించే ఎగ్జామినర్లు బోర్డు దృష్టికి తీసుకురావడం, తిరిగి వెంటనే మెయిల్ ద్వారా అదే ప్రశ్నాపత్రంను తిరిగి పంపించడం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.

ప్రశ్నపత్రంలోని 6వ పేజీ 7పేజీల్లో తప్పులు దొర్లాయి. ప్రశ్నపత్రంలో ఇంటర్ బోర్డు ప్రచురించిన పుస్తకంలో కరికులం విట్టి అనే పదం ఉంది. అ పదం బదులు రెస్యూమ్ అనే పదం వాడటం విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. ఏడవ పేజీలో పోస్ట్ ఆఫీస్ ఫారం ఫిల్లింగ్ విషయంలో కూడా అపీరియన్స్ ముద్రణ సరిగా లేకపోవడంతో కూడా విద్యార్థులు ఆందోళనకు గుర‌య్యారు. ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రం తయారు చేసే సందర్భంలో జరిగిన ఈ పొరపాట్లను సరిదిద్దుకోకుండా విద్యార్థులు పరీక్ష రాసే సమయంలో గందరగోళానికి గురై ఆందోళన చెందారని, పరీక్ష రాసే సమయంలో అంతరాయం కలిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.

ఇంటర్మీడియట్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. జరిగిన తప్పులపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని – ఈ రెండు ప్రశ్నలకు అదనపు మార్కులు వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ పరీక్ష ప్రశ్నాపత్రంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవాలని, పిల్లల పరీక్ష సమయాన్ని పెంచకుండా ఆటంకం కలిగించినందుకు సదరు ఆ ప్రశ్నలకు అదనపు మార్కులు వేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *