Naravaripalle | కోలాహలంగా సంక్రాంతి సంబరాలు

Naravaripalle | తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ) : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నారావారిపల్లెలో సంబరాలు ప్రారంభమయ్యాయి. గ్రామమంతా పండుగ వాతావరణంతో ఉత్సాహంగా కనిపించింది. ఈ సంబరాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. గ్రామస్తులతో మమేకమై సంక్రాంతి ఆనందాన్ని పంచుకున్నారు.

Naravaripalle

పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన సంప్రదాయ క్రీడలను ముఖ్యమంత్రి ఆసక్తిగా తిలకించారు. గ్రామీణ క్రీడలు, ఉత్సవ కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే సీఎం చంద్రబాబు ప్రజలతో మమేకమయ్యారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారి నుంచి అర్జీలు స్వీకరించారు.

Leave a Reply