Adilabad | అనాథ శవానికి అంత్యక్రియలు..

Adilabad | అనాథ శవానికి అంత్యక్రియలు..
- మానవత్వం చాటుకున్న పీసీఆర్ ఫౌండేషన్..
Adilabad | జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్ మేజర్ పంచాయతీలోని గాంధీనగర్ కు చెందిన అనాథ అయిన నారపాక శ్రీను గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ మృతిచెందారు. ఎవరూ అంతక్రియలకు ముందుకు రాకపోవడంతో.. విషయం తెలుసుకున్న పీసీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆ వార్డు సభ్యుడు ముడుగు ప్రవీణ్ కుమార్ ఆ మృతదేహానికి స్థానిక స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించి, సమాజం పట్ల తన ఉదారతను చాటుకున్నారు. ఆయనను పలువురు అభినందించారు.
